హైదరాబాద్: 28°C
వార్తలు

అంబులెన్స్ డ్రైవర్లకు ఏసీపీ కౌన్సెలింగ్..!

NTR: జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లతో సెంట్రల్ ఏసీపీ దామోదర్ సమావేశమయ్యారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అంబులెన్స్ సేవలకు అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పారదర్శకంగా సేవలు అందించాలని స్పష్టం చేశారు.