హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రధాని మోదీకి స్కైరూట్ సీఈవో కృతజ్ఞతలు

అంతరిక్షంలోకి ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించినందుకు ప్రధాని మోదీకి స్కైరూట్ సీఈవో పవన్ కుమార్ చందన కృతజ్ఞతలు తెలిపారు. తమ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినట్లు చెప్పారు. 'మా బృందం సగటు వయసు 28 మాత్రమే. 2018లో స్రైరూట్ ప్రారంభించినప్పుడు సానుకూల వాతావరణం లేదు. ఈ తొమ్మిదేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో విక్రమ్-1 తయారు చేశాం' అని వెల్లడించారు.