విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు శాస్త్రవేత్తలతో మోదీ ఫోనులో మాట్లాడారు. 'స్కైరూట్ విజయం.. దేశ యువతకు స్ఫూర్తినిస్తుంది. ప్రయోగాన్ని నేను కూడా వీక్షించా. ఏళ్ల తరబడి స్కైరూట్ కృషికి ఫలితమే ఈ విజయం. అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థలు విజయం సాధించలేవని కొంతమంది అన్నారు. ఈ సందేహాలను మీరు పటాపంచలు చేశారు' అని మోదీ పేర్కొన్నారు.
వార్తలు
రాకెట్ ప్రయోగం సక్సెస్.. మోదీ అభినందనలు


