హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన'

NRPT: ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట మండలం సింగారం గ్రామంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. తక్కువ మోతాదు నీటితో సాగయ్యే పంటలు వేసుకోవాలని చెప్పారు. జొన్న, రాగులు, వేరుశనగ, సజ్జలు సాగు చేయాలని అన్నారు.