హైదరాబాద్: 28°C
వార్తలు

'సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు'

VKB: కొడంగల్ నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రతీక అని కొడంగల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సొండే శ్రీను అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిపై, కొడంగల్ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.