హైదరాబాద్: 28°C
వార్తలు

రూ.1,341 కోట్లతో ఎల్ఈడీ మెగా ప్రాజెక్టు

TG: వీధి దీపాల ఆధునికీకరణ కోసం ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. GHMC, CMC, MMC కార్పొరేషన్ల పరిధిలో ఉన్న పాత వీధి దీపాల స్థానంలో అత్యాధునిక, అధిక సామర్థ్యం గల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయనుంది. 10 ఏళ్ల సమగ్ర నిర్వహణ కాలపరిమితితో కూడిన ఈ మెగా ప్రాజెక్టు అంచనా రూ.1,341.60 కోట్లుగా నిర్ణయించారు. రెండేళ్లలో 7.61L లైట్లను అమర్చాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.