ADB: యువత సామాజిక సేవలో ముందుండాలని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో 'మన ద్వారక ఫౌండేషన్' లోగోను MLA పాయల్ శంకర్ స్థానికులతో కలిసి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వచ్ఛంద కార్యక్రమాలను ఎమ్మెల్యే అభినందించారు. ఫౌండేషన్‌కు తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.
వార్తలు
'యువత సామాజిక సేవలో ముందుండాలి'


