హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు..!

BPT: పర్చూరు మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం బజారులో విద్యుత్ తీగలకు పిచ్చి మొక్కల తీగలు అల్లుకుపోయి ప్రమాదకరంగా మారాయి. పాఠశాలలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఈదురుగాలులు, వర్షాల సమయంలో తీగలు తెగిపడి ప్రమాదాలు జరిగే అవకాశముందని, అధికారులు వెంటనే స్పందించి ఆ పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు.