హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మవరం, పుట్టపర్తి మీదుగా బుల్లెట్ రైలు

సత్యసాయి: హైదరాబాద్‌-బెంగళూరు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ధర్మవరం, పుట్టపర్తి మీదుగా వెళ్లేలా ఎలైన్‌మెంట్‌లో మార్పు జరగనుంది. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులు, ప్రజల సౌకర్యార్థం ఈ రెండు చోట్లా స్టేషన్లు నిర్మించనున్నారు.