హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవసాయ వర్సిటీలో ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు

GNTR: రైతులు, గ్రామీణ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ ఆన్‌లైన్ కోర్సులను అందిస్తోంది. గుంటూరు లామ్ ఫామ్ కేంద్రంగా సెప్టెంబర్ నుంచి రెండు నెలల పాటు తేనెటీగల పెంపకం, జీవన ఎరువుల తయారీ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. ఫీజు రూ.1500 ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఎ.మణి సూచించారు.