హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో కోతుల బెడద

BPT: పట్టణం పాపినేని వారి వీధిలో కోతుల బెడదతో స్థానికులు హడలిపోతున్నారు. 30కి పైగా కోతులు గుంపులుగా ఇళ్లలోకి చొరబడుతున్నాయి. వస్తువులు లాక్కెళ్తూ, అడ్డుకోబోయిన వారిపై దాడులు చేస్తున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు సైతం కోతులకి భయపడి ఆ వీధికి వెళ్లడం లేదు. ఈ సమస్యపై ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.