హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆస్తి పన్నులు పెరగవు'

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఆస్తి పన్నులు పెరగవని మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర స్పష్టం చేశారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ధరలు పెంచినప్పుడు మాత్రమే ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు పెరుగుతాయని పేర్కొన్నారు. పన్నుల పెంపు విషయంలో పురజనులు అపోహ పడవద్దని తెలిపారు.