హైదరాబాద్: 28°C
వార్తలు

పుణ్యక్షేత్రాలకు IRCTC ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాల సందర్శన కోసం వెళ్లే యాత్రికులకు భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలును నడుపుతున్నట్లు IRCTC అధికారులు తెలిపారు. 8 రాత్రులు, 9 పగళ్ల ఈ యాత్ర రైలు ఈనెల 20న సికింద్రాబాద్ నుంచి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, మీదుగా అరుణాచలేశ్వరం, చిదంబరం, తిరుచ్చి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారిలోని వివేకానందరాక్ మెమోరియల్ ప్రాంతాలను సందర్శించి 28న తిరుగు ప్రయాణం అవుతుంది.