హైదరాబాద్: 28°C
వార్తలు

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన శశిథరూర్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. కేరళంలోని తిరువనంతపురంలో ఓ ప్రైవేట్ హోటల్ లిఫ్టులో ఆయన కొన్ని నిమిషాలపాటు చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది హైడ్రాలిక్ స్ప్రెడర్ సహాయంతో తలుపులు తెరిచి శశిథరూర్‌తో పాటు ఇతరులను రక్షించారు.