SKLM: జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ (జాప్) జిల్లా అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ పట్నాయక్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షడు పున్నంరాజు తెలిపారు. జిల్లాలో జాప్ సంఘాన్ని మరింత బలోపేతం చేసి, జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం కృషి చేస్తానని బాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
వార్తలు
జాప్ అధ్యక్షుడు నియామకం


