SKLM: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో "అభయం హెల్మెట్ అవగాహన కార్యక్రమం" నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని సూచించారు.
వార్తలు
'తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి'


