MDK: వర్షాభావ పరిస్థితుల్లో నీటిని జాగ్రత్తగా ఆదా చేసుకుని వినియోగించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వరికి బదులు పప్పుదినుసులు, ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, వాతావరణ మార్పులకు అనుగుణంగా సూచనలు ఇవ్వాలని తెలిపారు.
వార్తలు
నీళ్లు ఆదా చేసి వాడుకోవాలి: కలెక్టర్


