హైదరాబాద్: 28°C
వార్తలు

'పీఎం బీమాను సద్వినియోగం చేసుకోవాలి'

AKP: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు మునగపాక మండల వ్యవసాయ అధికారిణి జోత్స్న కుమారి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసే రైతులు ఎకరానికి రూ.84 ప్రీమియం చెల్లించాలన్నారు. వచ్చేనెల 15వ తేదీ వరకు ప్రీమియం చెల్లించడానికి గడువు ఉందన్నారు.