కామారెడ్డి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నట్లు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన 'దిశ' సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అధికారులు సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
వార్తలు
జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నాం: ఎంపీ


