హైదరాబాద్: 28°C
వార్తలు

హసీనా అప్పగింతపై భారత్ స్పందన

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించే అంశంపై ఆ దేశ అభ్యర్థనపై భారత్ స్పందించింది. ఈ అప్పగింత అంశం పూర్తిగా చట్టపరమైన ప్రక్రియ అని.. న్యాయపరమైన నిబంధనల ఆధారంగా దీనిని పరిశీలిస్తామని వెల్లడించింది. హసీనా విషయంలో ఎలాంటి మార్పులేదని చెప్పింది. కాగా, 2024 ఆగస్టులో నిరసనల కారణంగా ఆమె బంగ్లాను విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటున్నారు.