హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరు నెలల్లో 554 మంది భర్తలు బలి

భారత్‌లో రోజుకు సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతున్నట్లు 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' నివేదిక వెల్లడించింది. గత ఆరు నెలల్లో 554 మంది భర్తలు మరణించగా, ఇందులో 322 మందిని భార్యలే ప్రియులతో కలిసి హతమార్చారు. మరో 232 మంది వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. 60 శాతం కేసులకు వివాహేతర సంబంధాలే కారణమని, UP ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉందని పేర్కొంది.