హైదరాబాద్: 28°C
వార్తలు

'సెకండ్ క్లాస్ ప్యాసింజర్ అనడం రాజ్యాంగ విరుద్ధం'

రైళ్లలో ప్రయాణించే వారిని రెండో తరగతి ప్రయాణికుడు అని పిలవద్దని రైల్వే శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. 'క్లాస్' అనే పదం కేవలం బోగీలకు మాత్రమే వర్తించాలని, వ్యక్తులకు కాదని స్పష్టం చేసింది. రాయపూర్-అహ్మదాబాద్ రైలు ప్రయాణంలో భర్తను కోల్పోయిన లత అనే మహిళ దాఖలు చేసిన పరిహారం కేసు విచారణ సందర్భంగా, ఇలాంటి పదజాలం సమానత్వ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు పేర్కొంది.