MDK: టాలీవుడ్ నటుడు మంచు విష్ణు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, పర్యాటక శాఖ ఆహ్వానం మేరకు ఆయన జిల్లాకు రానున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మెదక్ ఖిల్లా, చారిత్రక మెదక్ చర్చిని సందర్శించనున్నారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
రేపు మెదక్‌కు హీరో మంచు విష్ణు


