హైదరాబాద్: 28°C
వార్తలు

'ఆ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే'

కేసుల వివరాలు దాచారనే కారణంతో TG కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. నామినేషన్ ఫారాల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. కేసు వివరాలు సమర్పించేందుకు సమయమిచ్చినా ఆమె సద్వినియోగం చేసుకోలేదని, RO నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పేర్కొన్నారు.