హైదరాబాద్: 28°C
వార్తలు

రిలయన్స్‌ లాభం.. అదరగొట్టిన జియో

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 'Q1' రూ.20,946 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది వాటాల విక్రయం (వన్-టైమ్ గెయిన్) మినహాయిస్తే కంపెనీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఓ2సీ, రిటైల్, డిజిటల్ వ్యాపారాలు రాణించడంతో కంపెనీ త్రైమాసిక ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.2.48 లక్షల కోట్ల నుంచి రూ.3.11 లక్షల కోట్లకు పెరిగింది.