హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరానికి అవమానం జరిగితే జైలుకే

జాతీయ గేయం 'జనగణమన'తో సమానంగా 'వందేమాతరం' గీతానికి కూడా చట్టపరమైన రక్షణ కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 'ప్రివెన్షన్ ఆఫ్ ఇన్‌సల్ట్స్ టు నేషనల్ హానర్' బిల్లును ప్రవేశపెట్టనుంది. వందేమాతరానికి అవమానం కలిగిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. అలాగే అధికారిక కార్యక్రమాల్లో దీని ఆలపనపై మార్గదర్శకాలను జారీ చేసింది.