హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 24న 104 వాహనాల ఈ-ఆక్షన్

SKLM: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 104 సంచార వైద్య సేవల కోసం వినియోగించిన పాత వాహనాలకు ఈ-ఆక్షన్ నిర్వహించనున్నారు. మొత్తం 20 వాహనాలను ప్రభుత్వ ఆన్‌‌లైన్ వేలం వేదిక ద్వారా విక్రయించనున్నట్లు DMHO ఇంఛార్జ్ డా.శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. వేలంలో పాల్గొనే వారు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు.