హైదరాబాద్: 28°C
వార్తలు

మండల బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడి నియామకం

VZM: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నెల్లిమర్ల మండల అధ్యక్షుడిగా గుషిణి గ్రామానికి చెందిన బూర్లె మహేష్ నియమితులయ్యారు. విజయనగరం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ చేతుల మీదుగా శుక్రవారం ఆయన నియామక పత్రాన్ని అందుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందించారు.