హైదరాబాద్: 28°C
వార్తలు

జీడీసీసీ బ్యాంకుకు రెండు మొబైల్ డెమో వాహనాలు

PLD: నరసరావుపేటలో జరిగిన క్రెడిట్ ఔట్‌రీచ్ కార్యక్రమంలో నాబార్డ్ 80 శాతం సబ్సిడీతో జీడీసీసీ బ్యాంకుకు రెండు మొబైల్ డెమోన్స్ట్రేషన్ వాహనాలను అందజేసింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా చైర్మన్ మక్కెన వాటిని స్వీకరించారు. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించనున్నారు.