హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్

ASR: అరకు ఐటీడీఏ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు, విద్యార్థులు, పర్యాటకులు అధికసంఖ్యలో రాకపోకలు సాగించే ప్రాంతంలో భద్రతా చర్యలు లేకపోవడంతో ప్రమాదానికి దారితీసే అవకాశముందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ వర్షపు నీరు నిల్వ ఉంటుందన్నారు. భద్రతా కంచె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.