హైదరాబాద్: 28°C
వార్తలు

మెట్రో పిల్లర్‌ను ఢీకొన్న బైకు.. ఇద్దరు మృతి

HYD: కూకట్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ యాక్సిడెంట్‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. TS 02 C6919 నెంబర్ బైక్‌పై ఓవర్ స్పీడ్‌తో వచ్చిన ఇద్దరు యువకులు మెట్రో పిల్లర్ 746కు ఢీకొట్టారు. ఈ ఘటనలో డ్యూక్ బైక్ తీవ్రంగా ధ్వంసమైంది. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.