హైదరాబాద్: 28°C
వార్తలు

'ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలి'

NRML: జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మండలాల వారీగా నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. అలాగే భూగర్భ జలాల పెంపు కోసం ఫాం పాండ్లు, వర్షపు నీటి రీచార్జ్ నిర్మాణాలను చేపట్టడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.