హైదరాబాద్: 28°C
వార్తలు

క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ రేషన్ కార్డులు

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా అధికారులు ఆ కార్డు నిజమైనదో.. కాదో? క్షణాల్లో తెలుసుకోవచ్చు. తద్వారా నకిలీ రేషన్ కార్డులు, ఒకే వ్యక్తి పేరిట ఉన్న బహుళ కార్డుల వంటి అక్రమాలను సులభంగా అరికట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు.