భారత్‌లో భూమి కొనుగోలు చేసినంత మాత్రాన ఇక్కడి పౌరులుగా పరిగణించలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. చొరబాటు ఆరోపణలపై బెంగాల్ పోలీసుల చేతిలో అరెస్టయిన నసీర్ మొల్లా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. విదేశీయులు ఎవరైనా దేశంలో ఆస్తులు కొనవచ్చని, కానీ అది పౌరసత్వానికి అర్హత కాదని హైకోర్టు తేల్చి చెప్పింది.
వార్తలు
'భూమి కొన్నంత మాత్రాన పౌరసత్వం రాదు'


