హైదరాబాద్: 28°C
వార్తలు

మదర్సాకు రూ. లక్ష విరాళం అందించిన ఎమ్మెల్యే

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మదర్సా పెద్దలు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కలిసి తమ మదర్సాకు సహాయం అందించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, తన సొంత నిధుల నుంచి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మదర్సా మత పెద్దలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.