SRCL: 2026-27 విద్యా సంవత్సరానికి వాలీబాల్ అకాడమీల్లో ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎ.రాందాస్ తెలిపారు. 14–18 ఏళ్ల తెలంగాణ స్థానిక బాలబాలికలు అర్హులు. జూలై 20 నుంచి 26 వరకు సరూర్‌నగర్, సిద్ధిపేట, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ఎంపికలు జరుగుతాయి. అవసరమైన ధ్రువపత్రాలతో ఉదయం 7 గంటలకు హాజరుకావాలని సూచించారు.
వార్తలు
వాలీబాల్ అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు


