ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బెంగాల్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 'SIR'పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పేరు తొలగించిన వారికి సంక్షేమ పథకాలను నిరాకరించవచ్చా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.
వార్తలు
ఓటరు జాబితాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు


