హైదరాబాద్: 28°C
వార్తలు

నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై మౌనం వీడాలి: రాపోలు

SRPT: నేరేడుచర్లలో పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతను బీఆర్ఎస్ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ కలిశారు. ఈ నేపథ్యంలో నవీన్ మాట్లాడుతూ..సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీల అమలుపై ప్రభుత్వం మౌనం వీడాలని డిమాండ్ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి తదితర హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.