హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు భూమిపూజ

ADB: తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో రూ.50 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మాజీ ఎంపీ సోయం బాపూరావు, ఏఎంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం టేకుగూడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.