VZM: మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి బొబ్బిలిలోని బ్యాంక్ కాలనీ, సంఘ వీధి, ఆకులరెల్లి వీధి ప్రాంతాల్లో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. రోడ్ల పక్కన పెరిగిన పిచ్చిమొక్కలు, బెర్ములను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో సంబంధిత వార్డు సచివాలయ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.
వార్తలు
పారిశుధ్యంపై కమిషనర్ ఆగ్రహం


