హైదరాబాద్: 28°C
వార్తలు

పలువురిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

VZM: బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో అనారోగ్యంతో ఉన్న మాజీ ఎంపీటీసీ పూడి గంగునాయుడు, సీనియర్ నాయకుడు మర్రపు సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు శుక్రవారం వారి నివాసాలకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, మెరుగైన వైద్యం తీసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.