హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన వసతి గృహాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

KRNL: పామూరు మండలంలో కస్తూర్బా బాలికల పాఠశాలలో సమగ్ర శిక్ష పథకం కింద రూ.1.94 కోట్లతో నిర్మించిన నూతన వసతి గృహాలను కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన వసతి, మంచి విద్య అందించడం కూటమి లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.