హైదరాబాద్: 28°C
వార్తలు

కోమటికొండాపూర్‌లో భూభారతి గ్రామ సభ

JGL: రైతుల భూ సమస్యల పరిష్కారానికే భూభారతి సర్వే చేపడుతున్నామని ఆర్డీఓ నరసింహారావు అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్‌లో గురువారం భూభారతి సర్వే గ్రామ సభ జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సర్వేకు సహకరించి తమ భూ రికార్డులను పక్కాగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.