హైదరాబాద్: 28°C
వార్తలు

భవిష్యత్తు అంతా హైడ్రోజన్‌దే: మోదీ

హర్యానాలోని జింద్ స్టేషన్‌లో హైడ్రోజన్ రైలును ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. భవిష్యత్తు అంతా హైడ్రోజన్‌దే అని తెలిపారు. 'రైల్వేలో డీజిల్, విద్యుత్ వినియోగం తగ్గిస్తాం. పర్యావరణహిత ప్రాధాన్యంలో భాగంగానే హైడ్రోజన్ రైలు. హైడ్రోజన్ పేరుతో హర్యానా పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. రైల్వే రూపురేఖలు మార్చడంలో ఇది కీలకమైన అడుగు' అని మోదీ వెల్లడించారు.