MDK: మెదక్ స్టేడియంలో శనివారం 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి మిడిల్, లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటరమణ, మధుసూదన్ తెలిపారు. బాలబాలికలు, పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ క్రీడలను స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రారంభించనుండగా, రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొననున్నారు.
వార్తలు
మెదక్‌లో రాష్ట్ర స్థాయి పోటీలు


