ADB: శుక్రవారం సోనాల మండల బీఆర్ఎస్ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిసి, తెలంగాణ పబ్లిక్ మోడల్ స్కూల్‌ను సోనాల మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సోనాల మండల అభివృద్ధితో పాటు పబ్లిక్ మోడల్ స్కూల్ ఏర్పాటు కోసం తన వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.
వార్తలు
పబ్లిక్ స్కూల్ కోసం వినతి


