హైదరాబాద్: 28°C
వార్తలు

స్టాల్స్‌ను పరిశీలించిన కలెక్టర్

PLD: నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా రుణమేళా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాల్స్‌ను కలెక్టర్ కృతికశుక్లా పరిశీలించారు. స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన సేవలు, లబ్ధిదారులకు అందించే సౌకర్యాలు, శాఖల సమన్వయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.