హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి వ్యాఖ్యలు

GNTR: తెనాలిలో మంత్రి నాదెల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తన బలాబలాల ఆధారంగా పోటీ చేస్తుందని మంత్రి మనోహర్ స్పష్టం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు పవన్ కళ్యాణ్ ఒక అడుగు వెనక్కు తగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. అదే ఫార్ములా ఇప్పుడు కూడా అమలు అవుతుందని జరుగుతున్న ప్రచారం కరెక్ట్ కాదన్నారు.