హైదరాబాద్: 28°C
వార్తలు

పలు కీలక బిల్లులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధం!

ఈనెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు కీలక బిల్లులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. డీలిమిటేషన్, జమిలీ ఎన్నికల బిల్లులు పెట్టే అవకాశం ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రానికి బలం పెరిగింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లులు ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహం రచిస్తోంది. మరోవైపు 130వ రాజ్యాంగ సవరణను విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.