VZM: బొబ్బిలి ఎంపీడీవో రవికుమార్ శుక్రవారం కృష్ణాపురంలో స్దానిక మహిళలకు చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ఇళ్లలోనే తడి, పొడి చెత్తను వేరు చేసి గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా ఉండాలన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణకు రాకపోతే పిర్యాదు చేయాలని సూచించారు.
వార్తలు
'చెత్త సేకరణకు రాకపోతే పిర్యాదు చేయండి'


